పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన

 రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్

పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు కు ఘనంగా సత్కరించిన

మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ పోలీసు అధికారులకు పదవీ విరమణ పొందిన టివి హనుమంత రావు, అడిషనల్ డీసీపీ,స్పెషల్ బ్రాంచ్,  ఎం సుగుణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్,   అకౌంట్స్, మహమ్మద్ షర్ఫుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎల్ బి నగర్ డి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్ మహమ్మద్ ఫైజుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్  సీఐ సెల్, వి సాగర్ రావు, సబ్ ఇన్స్పెక్టర్  ఉప్పల్ ఉమెన్  పోలీస్ స్టేషన్,  మహమ్మద్ షంషీర్ ఖాన్, ఏఆర్ ఎస్ఐ హెడ్ క్వార్టర్ భువనగిరి లకు సీపీ శ్రీ సుధీర్ బాబు, ఐపీఎస్ రాచకొండ పోలీస్ కార్యాలయం లో సన్మానం చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. WhatsApp Image 2025-07-31 at 3.29.21 PM

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, డిసిపి ఎస్బి జి నరసింహ రెడ్డి,  అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్ రెడ్డి, సిఏఓ అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, టేకుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.