పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన   సీపీ 

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన   సీపీ 

వరంగల్ క్రైమ్,తెలంగాణ ముచ్చట్లు:

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐలు ఐలయ్య, రాజేందర్, ఎం.డి. వలీ, డేవిడ్, ఏఎస్‌ఐలు వెంకట కృష్ణా రావు, దామోదర్ చారి, చాంద్ పాషా, హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి లను పూలమాలలు వేసి సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా, కమిషనర్ మాట్లాడుతూ, పోలీసుల కృషి సమాజానికి ఎనలేని సేవలుగా నిలుస్తుందని, ఈ అధికారులు తమ పదవీకాలంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సమాజ శాంతి భద్రతల కోసం చేసిన త్యాగాలు రేపటి తరం పోలీసులకు ప్రేరణగా ఉంటాయని చెప్పారు. పదవీ విరమణ చేసిన అధికారులు తమ ఆరోగ్యం కోసం యోగ, వ్యాయామం కొనసాగించడంతో పాటు కుటుంబంతో సమయాన్ని ఆస్వాదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసిపిలు రవి, సురేష్‌కుమార్, ఏసీపీ సురేంద్ర, ఆర్‌ఐలు సతీష్, స్పర్జన్‌రాజ్, శ్రీనివాస్, పదవీ విరమణ చేసిన అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .