పోలీసుశాఖలో హోంగార్డుల  సేవలు కీలకం -పోలీస్ కమిషనర్

పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో ఘనంగా 62 వ. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం

పోలీసుశాఖలో హోంగార్డుల  సేవలు కీలకం -పోలీస్ కమిషనర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

పోలీసు శాఖలో హోంగార్డుల  సేవలు కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కొనియాడారు.  62 వ. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కారించుకొని సిటీ పోలీసు పరేడ్‌ మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన పోలీస్ కమిషనర్ ముందుగా సాయుధ హోంగార్డు ప్లాటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతు  పరిశీలించారు. పరేడ్ కమాండర్ గా ఈ. వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..పోలీస్ శాఖలో ఒక భాగమై, పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ... హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. ఇటీవల భారీ వరదల సమయంలో తమ ఇల్లు సైతం వరద తాకిడికి గురై కుటుంబం ఇబ్బందులలో వున్నప్పటికి అంకిత భావంతో సమాజ సేవలో నిమగ్నమైయ్యారని అన్నారు. సాధారణ విధులు మొదలు క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తూ.... హోంగార్డు వ్యవస్థ పోలీస్‌ శాఖలో కీలకంగా మారిందని అన్నారు. శాంతిభద్రతలు, ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతయుతమైన సేవలు అందించడంతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర , కేరళ, మధ్యప్రదేశ్ , చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన భాధ్యతలు నిబద్ధతతో నిర్వహించారని అన్నారు.
నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. హోంగార్డుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం హోంగార్డుల స్పోర్ట్స్‌మీట్‌ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్ ,అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్  ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి , ఏసీపీ సాంబరాజు,ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్ , నర్సయ్య , హోంగార్డు ఆర్ ఐ సురేష్, శ్రీశైలం, అప్పలనాయుడు పాల్గొన్నారు.WhatsApp Image 2024-12-06 at 9.21.16 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .