“జ్ఞానము ద్వారానే విద్యార్థులు విజయతీరాలకు చేరుతారు” 

హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

“జ్ఞానము ద్వారానే విద్యార్థులు విజయతీరాలకు చేరుతారు” 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా, హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుబేదారి యందు మొదటి రోజు విద్యా దినోత్సవం సందర్భంగా పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై మండల స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు 150 మందికి పైగా విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి హాజరయ్యారు.

 

WhatsApp Image 2024-12-01 at 8.14.37 PMముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జ్ఞానాన్ని ఆర్జించడం ద్వారా మాత్రమే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరగలుగుతారని, పఠనాన్ని నిరంతరం కొనసాగించి ఇలాంటి పోటీలలో పాల్గొనాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు మరియు పాఠశాలల మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ అవసరాలు పూరించబడుతున్నట్లు ఆయన చెప్పారు. మండల స్థాయిలో జరిగిన పోటీలకు విద్యార్థుల భారీ రాక ఆనందకరమని ఆయన చెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......