తేజస్వీ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024

తేజస్వీ పాఠశాలలో జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ తేజస్వి పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన-2024 కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, శాసన మండలి సభ్యులు అలుగువెల్లి నర్సిరెడ్డిలు  హాజరయ్యారు.

విద్యార్థుల స్వాగతం మధ్య ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సి.వి. రామన్, అబ్దుల్ కలాం చిత్రపటాలకు పూలమాలలువేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే నాగరాజు ప్రదర్శనను ప్రారంభించారు.

WhatsApp Image 2024-11-29 at 9.13.18 PM
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక చింతన అభివృద్ధి చేయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు బహుమతి అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరూ కలిసి తమ ప్రతిభను ప్రదర్శించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యాశాఖలో ప్రతిష్టాత్మకమైన మార్పులు జరుగుతున్నాయని, నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, డిఇవో వాసంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......