పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్ 

ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం క్రింద మెదక్ జిల్లాకు 5 కోట్ల 40 లక్షలు  మంజూరు

 పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్ 

 
 ప్రభుత్వ పాఠశాల్లో టాయిలెట్స్ క్రింద 12 లక్షలు
 
- సిసిరోడ్ల నిర్మాణం కు 3 కోట్ల 60 లక్షలు
 
- గ్రామపంచాయితీ బిల్డింగ్ ల నిర్మాణం కొరకు 1 కోటి 20 లక్షలు
 
- అంగన్ వాడీల బిల్డింగ్ ల నిర్మాణం కొరకు 48 లక్షలు మంజూరు
 
- మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
 
మెదక్,తెలంగాణ ముచ్చట్లు:
ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం క్రింద మెదక్ జిల్లాకు 5 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు అయినట్టు మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పేర్కోన్నారు. మంగళవారం మెదక్ నియోజక వర్గంలోని పలు మండలాల్లో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల్లో నూతనంగా టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు 12 లక్షల రూపాయలు, అదే విధంగా జిల్లాలో సిసి రోడ్ల నిర్మాణం కు 3 కోట్ల 60 లక్షల రూపాయలు, గ్రామపంచాయితీ బిల్డింగ్ ల నిర్మాణం కొరకు 1 కోటి 20 లక్షలతో పాటు అంగన్ వాడీల బిల్డింగ్ ల నిర్మాణం కొరకు 48 లక్షల రూపాయలు మంజూరు అయినట్టు ఆయన తెలిపారు. అంతే కాకుండా మెదక్ జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన పేర్కోన్నారు.
 
ప్రజా విజయోత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
 
మంగళవారం మెదక్ నియోజక వర్గంలోని పాపన్నపేట మండలంలో ప్రజావిజయోత్సవాల్లో భాగంగా ఎల్లాపూర్ గ్రామంలో సిఆర్ఆర్ పథకం ద్వారా మంజూరు అయిన రోడ్డు పనులకు ఆయన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ శంఖుస్థాపన చేశారు. అదే విధంగా హావేళిఘణాపురం మండల కేంద్రంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం క్రింద సిసి రోడ్డు పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింలు, భరత్, శ్రీధర్, హావేలిఘణపురం మండల నాయకులు లక్కరు శ్రీనివాస్, బాలకిషన్, పరుశురాం, అక్బర్, శ్రీకాంత్, రాంచందర్, పద్మారావు, పోశెట్టి, రాము, యాదగిరి, మెదక్ మండల నాయకులు శ్రీనివాస్ చౌదరి, పేరూర్ శంకర్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
 
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .