వ్యవసాయ కూలీలకు బేషరతుగా 12000 రూపాయలు ప్రభుత్వం అందజేయాలి
మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజా హుస్సేన్
వనపర్తి , తెలంగాణ ముచ్చట్లు:
రెక్కల కష్టమే ఆస్తిగా చెమట చుక్కలే పెట్టుబడిగా భూమిపై వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామన్న సంవత్సరానికి 12 వేల రూపాయల పథకమును ఏలాంటి షరతులు లేకుండా భేషరతుగా అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఖాజా హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు అందజేస్తామని వాగ్దానం చేసింది కానీ అమలు చేయడంలో సంవత్సరం గడుస్తున్న ఇంకా అనేక కొర్రీలు పెట్టి రెండు దఫాలంటూ మొదటి దఫా 6000 రెండో దఫా 6000 ఇస్తామని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన చేశారు. మరల ఇప్పుడు జాబ్ కార్డు ఉన్నవారు వంద రోజులు పని చేస్తేనే అర్హులంటూ, కుంట. రెండు గుంటలు ఉన్న చిన్న రైతులకు రైతు భరోసా ఏమి రాదు యంత్రాలు వచ్చి వ్యవసాయ కూలీల పనులు తగ్గిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం అనేక షరతులతో మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ పథకాన్ని పనులను తగ్గించుకుంటూ షరతులు పెట్టుకుంటూ కేంద్ర బడ్జెట్ లో నిధులను తగ్గించుకుంటూ వస్తుంది గ్రామీణ ప్రాంతంలో సంపూర్ణంగా పనిని కల్పించడం లేదు. పట్టణ ప్రాంతాలకు ఈ పనిని అనుమతి ఇవ్వటం లేదు ఫీల్డ్ అసిస్టెంట్లతోటి సర్వేలు చేయించి కూలీల వడపోత కార్యక్రమాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ తప్పుడు విధానాలను వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో వ్యవసాయ కార్మికులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు అధికారంలోకి రాగానే అందజేస్తామని చెప్పారు. అందజేస్తామని చెప్పి నేడు కూలీలకు అనేక షరతులు విధిస్తున్నారు. ఈ విధానం సరి అయినది కాదని వ్యవసాయ కూలీలందరికీ ప్రభుత్వ పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం వందరోజుల పని ప్రకటించినప్పటికీ ఆచరణలో గ్రామాలలో 50. 60 రోజుల కన్నా ఎక్కువ జరగటం లేదు. అది కూడా వ్యవసాయ కూలీలు డివైడ్ చేసి పని కల్పించాలని కోరుతూ అప్పుడు పనికిటాయిస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చిన ఆధారంగా కాకుండా ప్రతి ఒక్కరికి వ్యవసాయ కార్మికులకు పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం చేసిన వాగ్దానం సంపూర్ణంగా చేయాలని లేనిపక్షంలో కార్మికులు చేసే పోరాటానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది అని అన్నారు . కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజా హుస్సేన్. బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సతీష్ శర్మ. సేవియా నాయక్ . వెల్టూరు బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments