1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
-గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి....
తెలంగాణ ముచ్చట్లు (నూగురు) వెంకటాపురం ములుగు జిల్లా:
మండలం కేంద్రంలో ప్రభుత్వ భూములు క్రయ విక్రయాలు ఆపాలి
ఏజెన్సీ భూముల పై సర్వ హక్కులు ఆదివాసులదే
5 వ షెడ్యూల్డ్ భూభాగంలో ఆదిమ తెగల అభివృద్ధి పరిరక్షించే 1/70 ఎల్టిఆర్ చట్టాలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలి. అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంతో గిరిజనేతరులు ప్రభుత్వ భూముల్లో తిష్ఠ వేసి యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని పూనెం సాయి ఆరోపించారు. శుక్రవారం నాడు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని,గిరిజనేతరులు ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలు ఆపాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ సంఘ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్యకి వినతి పత్రం అందజేశారు.అనంతరం జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు వెన్నుముక లాంటి
1/70 (LTR) చట్టాలు అమలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు,ముఖ్యంగా వెంకటాపురం మండలంలో గిరిజన చట్టానికి యథేచ్ఛగా తూట్లు పోడుస్తున్నారు. ఐటీడీఏ కూడా ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని.శివాలయం మొదలుకొని పెట్రోల్ బంక్ వరకు అడ్డగోలుగా జరుగుతున్న అక్రమాలు అధికారుల కళ్లకు కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీలో అక్రమంగా గిరిజనేతరులు నిర్మించిన భవనాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతాం అని హెచ్చరించారు.ప్రభుత్వ భూములను గిరిజెనేతరులు ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని.వెంకటాపురం(జెడ్) సర్వే నంబర్ 68 లో ప్రభుత్వ భూములు మొత్తం కబ్జాకు గురైందని ఆయన ఆరోపించారు. కబ్జా కి గురైన వెంకటాపురం(జెడ్) సర్వేనెంబర్ 68 గల ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకొని,ఇండ్లు లేని పేద ఆదివాసి కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ లో ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇస్తామని హెచ్చరించారు.


Comments