పటిష్టమైన విద్యా వ్యవస్థ తోనే మెరుగైన సమాజ నిర్మాణం

మెదక్ ఆర్డిఓ రమాదేవి

పటిష్టమైన విద్యా వ్యవస్థ తోనే మెరుగైన సమాజ నిర్మాణం

 -మెదక్,తెలంగాణ ముచ్చట్లు:

కామన్ డైట్ చార్జీల పెంపు, కామన్ మెనూ కార్యక్రమాన్ని మెదక్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఉమెన్ 
లో ఆర్డీవో రమాదేవి శనివారం ప్రారంభించారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం పెంచిన  40 శాతం డైట్ చార్జీల చార్ట్ ను ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి విద్యార్థులతో కలిసి  భోజనం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆర్డీఓ  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను అన్ని పాఠశాలల్లో  అమలు చేయాలని , నూతన మెనూను ప్రకారం ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో డైట్ చార్జీలను ఎప్పుడు పెంచలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 40 డైట్ చార్జీలు పెంచడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను తు.చా తప్పకుండా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని అధికారులు అమలు చేయాలన్నారు.  అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ నూటికి నూరు శాతం పాటించాలని,  ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-12-14 at 9.43.36 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .