విషాదం నింపిన 31st దావత్..
కొత్త సంవత్సరం రాక ముందుకే తెల్లారిన బతుకులు
-కొత్త సంవత్సరం వేడుకలల్లో విషాదం
ఆదిలాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది వేడుకల సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు మూడు ప్రాణాలను బలిగొన్నాయి.
ఇప్పలగూడ వద్ద ప్రమాదం:
అడిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఇప్పలగూడ గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో మేషారం సాయి (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శన్ముఖ్, అజయ్ అనే ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల అనంతరం ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దండేపల్లి వద్ద ప్రమాదం:
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో మోటార్ సైకిల్ కడెం ప్రధాన కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రాజు (30), పవన్ (28) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, పవన్ ఇటీవలే వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ డిసెంబర్ 31 వేడుకల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల హెచ్చరిక:
ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త ఏడాది వేడుకల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.


Comments