జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని
వనపర్తి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన పుట్టమౌని వైష్ణవి జాతీయ స్థాయిలో కరాటే పోటీలలో పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.
ముంబైలోని ఆంధేరి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఐదవ అంతర్జాతీయ కరాటే పోటీలలో ఐకాన్, చోటా ఖాన్ విభాగంలో పాల్గొన్న వైష్ణవి బంగారు మరియు వెండి పతకాలు గెలుచుకుంది. ఈ విషయాన్ని కరాటే గురువు సురేష్ గౌడ్ తెలిపారు.
ఈ పోటీలలో జపాన్, మలేషియా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. హైదరాబాద్ గ్రీన్ వుడ్స్ టెక్నో పాఠశాల, నాగోల్ భూపతి ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా ఈ పోటీలలో బంగారు, వెండి పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టారని ఆయన తెలిపారు.
హైదరాబాద్ గ్రీన్ వుడ్స్ టెక్నో పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న వైష్ణవి విజయం పై తల్లిదండ్రులు టైలర్ బాలరాజు, లక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.


Comments