నారాయణవరపు శ్రీనివాస్ కు అదనపు బాధ్యతలు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జిగా నియామకం.
సత్తుపల్లి, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన నారాయణవరపు శ్రీనివాస్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న శ్రీనివాస్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జి హోదాను జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హైదరాబాదులోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో నియామకపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని శ్రీనివాస్‌కు సూచించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట 42 శాతం బీసీల రిజర్వేషన్ల సాధన కోసం శ్రీనివాస్ చేసిన ఆమరణ నిరాహార దీక్షను, అలాగే ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా నిరంతరం చేస్తున్న ప్రజా పోరాటాలను అభినందించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య, సోషల్ మీడియా ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరీదు ప్రసాద్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాజేందర్, అనంతయ్య, రేగా రమేష్, రాజు కోటి, ఖమ్మం జిల్లా నాయకులు కర్రీ కమలాకర్, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments