అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ విశేష కృషి
-మాజీ ఎంపీ నామ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి అత్యున్నత విలువలను అందించిన అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ విశేష కృషి చేసారని, దేశ సమైక్యతకు పునాది వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. సమాజంలో పేరుకుపోయిన అసమానతలు రూపుమాపేందుకు ఆయన చూపిన చొరవ ఆమోఘమైనదని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైందని, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడంతో పాటుగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేసారు. నేటి యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి అందరం కృషి చేయాలని నామ కోరారు.


Comments