అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

అఖిలపక్షం డిమాండ్

అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

మధిర స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం నుండి కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బెజవాడ రవిబాబు మాట్లాడుతూ భారత ప్రజలకు దళిత గిరిజన బహుజన పేద మహిళ నా హక్కుల కోసం నిరంతరం పోరాడి వారికి అండగా నిలిచిన మహనీయుని అవమానపరచడం అంటే భారత ప్రజలను అవమానపరిచినట్టేనని అన్నారు. మనువాద భావజాలంతో కళ్ళు మూసుకుపోయిన అమిత్ షాకు భారత రాజ్యాంగం అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు చెప్పిన ఇష్టం ఉండదని అందుకే అంబేద్కర్ను అవమాన పరుస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని దీని ప్రజలంతా గమనించి తిప్పి కొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సిపిఎం పార్టీ నుండి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీల నరసింహారావు మందా సైదులు పడకంటి మురళి తేలపోలు రాధాకృష్ణ మాజీ పట్టణ కార్యదర్శి మండవ పనింద్రకుమారి కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా వేణు రంగా హనుమంతరావు అద్దంకి రవి కర్నాటి రామారావు అద్దంకి రవి దుంప వెంకటేశ్వర్ రెడ్డి నిడమానూరు వంశీకృష్ణ చిలువేరు బుచ్చి రామయ్య ధారా బాలరాజు చిట్టిబాబు సిపిఐ నాయకులు ఓట్ల కొండలరావు పెరుమాళ్ళపల్లి ప్రకాష్ రావు అన్నవరపు సత్యనారాయణ చావా వెంకటేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .