అంబేద్కర్‌ను అవమానపరిచిన అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా కొనసాగే అర్హత లేదు
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మసాగర్ మండల దళిత హక్కుల పోరాట సమితి మండల కార్యదర్శి రాజారపు రత్నం మాట్లాడుతూ, అంబేద్కర్‌ను అవమానించే విధంగా అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు హేయమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి కేంద్ర హోం మంత్రిగా కొనసాగడానికి అర్హత లేదని ఆరోపించారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పెద్ద పెండ్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రాజారపు రత్నం మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడంలో బీజేపీ మనువాద ధోరణి మరోసారి బయటపడిందని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవి అనుభవిస్తున్న వారు, అలాంటి మహానుభావుని అవహేళన చేయడం సిగ్గుచేటన్నారు.
జమిలి ఎన్నికలపై విమర్శలు
జెమిలి ఎన్నికల ద్వారా బీజేపీ అవినీతిపరులను కాపాడడానికి ప్రయత్నిస్తోందని, ఇది దేశ ప్రజలను మరింత దారిద్ర్యంలోకి నెట్టే యత్నమని రాజారపు రత్నం పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ పార్లమెంట్ సమయాన్ని వృథా చేయడం సరైనది కాదని ఆయన అన్నారు.
అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్
అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న లక్షలాది మందిని అవమానించాయని ఆరోపించారు. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న అమిత్ షా, దేశానికి ప్రమాదమని, వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి పెద్ద పెండ్యాల గ్రామ శాఖ కార్యదర్శి రాజారపు దేవన్న, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి గోకుల రాజయ్య, పెద్ద పెండ్యాల దళిత నాయకులు కలకోటి సాంబయ్య, కొత్తపల్లి బిక్షపతి ,జిట్ట కుమార్,రాజారపు చింటూ. కొలుగూరి బాబు.శీను గంధమాల రాజన్. బాబు .ఆరోగ్యం. సురేష్ అగస్టిన్ బన్నీ జీవన్ అన్వేష్ గట్టయ్య ప్రకాశం ఎల్లయ్య ఇంద్రయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments