పెద్దమందడిలో ఘనంగా చెన్నకేశవ స్వామి ఆలయంలో అమ్మవారి పూజలు
పెద్దమందడి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ భూమిలా చెన్నకేశవ స్వామి ఆలయంలో వేదమంత్రాలతో అమ్మవారి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. భాస్కర్ అయ్యారు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ ఎద్దుల రాధాకృష్ణ, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పురజనులు పాల్గొన్నారు.
మాలాధారణ చేసిన భవానీమాతలు అశ్విని రాధామ్మ, కె. రమాదేవి, వాకిటిలక్ష్మి, వాకిటి చంద్రకళ, అంజనమ్మ.
వస్త్రదాతలుగా కడియాల బాలకృష్ణ ఏఈ సతీమణి కృష్ణవేణి ముందుకు రాగా, పూజ నిర్వాహక అన్నదాతలుగా పోలీస్ మోహన్ రెడ్డి సతీమణి సువర్ణ, సికింద్రాబాద్ డిఎస్ సురేష్ సతీమణి సుజాతమ్మ వ్యవహరించారు. అఖండజ్యోతి కార్యక్రమాన్ని జిఎస్ గోపి సతీమణి సుగుణవేణి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వాకిటి నాగభూషణం, సేనాపతి, గురుస్వామి శ్రీనివాస్ గౌడ్, అశోక్, ఎద్దుల యశ్వంతు, కోమిరిశెట్టి శ్రీకృష్ణ, అజయ్, సూర వినయ్ సాగర్, హేమంతు చారి తదితరులు పాల్గొన్నారు.


Comments