ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండల కేంద్రంలోని గుట్టపై శ్రావణ మాసంలో జరిగే వేల్పుగొండ లక్మినరసింహస్వామి వేడుకల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం మండల పరిధిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేశారు.ఈ సందర్బంగా సంఘం జిల్లా నాయకులు చిట్టిమల్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ... అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు.అలాగే గత రెండు సంత్సరాలుగా గుట్ట పైకి వచ్చే భక్తుల కోసం అన్న దానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అన్న దానం వంటి పవిత్రమైన కార్యక్రమం మరొకటి లేదన్నారు. అంతే కాకుండా సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందంజలో ఉంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి రాజయ్య, బోనగరి శ్రవణ్ కుమార్, రమేష్, మణికాంత్,గందె సీతారాములు, అంచురి యుగేందర్, నాగరాజు, హరి శంకర్, సోమేశ్వర్, రేవూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments