పకార వేతనాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి...

కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ కె. విజయ భాస్కర్ రెడ్డి

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

కార్మికుల పిల్లలు, కార్మికులు ఉపకార వేతనాలు కొరకు ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తు చేయాలని కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ కె. విజయ భాస్కర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటార్ రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ఇతర ట్రస్ట్ లలో పనిచేయుచున్న కార్మికుల పిల్లలు, కార్మికులకు ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఐ.టి.ఐ. కోర్సు ఉత్తీర్ణులైన వారికి వెయ్యి రూపాయలు, పాలిటెక్నిక్ కోర్సుకు 1500 రూపాయలు, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బి.ఎస్.సి., బి.సి.ఏ., ఎం.సి. ఏ., బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బి.బి.ఏ., యం.బి.ఏ., డిప్లొమా, పిజి డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి రెండు వేల రూపాయలు ఉపకార వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మేడే నాటికి లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని కె. విజయ భాస్కర్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .