అన్నపూర్ణాదేవికి అష్టోత్తర శత 108 కలశ స్నపన పూజ
నాగారం, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్.వి.నగర్ రోడ్ నెంబర్ 8లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ అన్నపూర్ణాదేవికి అష్టోత్తర శత (108) కలశ స్నపన పూజను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో మూలమంత్ర హోమం, రుద్రాభిషేకం, చండీ పారాయణం, ధాన్యాధివాసాంగ హోమం, విశ్వావసు గంధర్వ హోమం, రుద్రహోమం, చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా సాగాయి.దేవస్థానం నిర్వాహకులు ఎంవిఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ ఆలయంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి, నాగబంధ, మృత్యుంజయ, మేధా దక్షిణామూర్తి, అభయాంజనేయ, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపారు
.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, సహాయకులు జమ్మలమడక శ్రీరమణ శర్మ, ఆలయ అధ్యక్షులు దాచా శ్రీనివాస్ గుప్తా, ఎర్రం ఈశ్వరయ్య గుప్త, లింగా నాగేంద్ర గుప్త, పీవీవీ సత్యనారాయణ, నరసింహస్వామి గౌడ్, గంగిరెడ్డి నరేందర్ రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వరరావు, వి. నర్సింహస్వామి గౌడ్, ఆంజనేయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


Comments