నేనున్నాను అని...  మాజీ ఎంపీ నామ భరోసా

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ

నేనున్నాను అని...  మాజీ ఎంపీ నామ భరోసా

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 25, తెలంగాణ ముచ్చట్లు;

బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గురువారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఖమ్మం అసెంబ్లీ, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించిన నామ పదవి వున్నా లేకున్నా మీకు నేనున్నాను అనే భరోసా కల్పించారు. అందులో భాగంగా కూసుమంచి మండలం, గోపాలరావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మాతృమూర్తి భద్రమ్మ దశదిన కర్మకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, చంద్రావతి తో కలిసి హాజరై భద్రమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జెసి కృష్ణ, బానోతు మంజుల బిఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు బి రెడ్డి నాగచంద్రారెడ్డి, మల్లిడి వెంకటేశ్వర్లు, బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, వరప్రసాద్, భాషబోయిన వీరన్న, ఆసిఫ్ పాషా, మరికంటి రేణుబాబు, గొడ్డేటి మాధవరావు, జర్పుల బాలాజీ, బానోతు కిషన్ నాయక్, బజ్జూరి రామిరెడ్డి, మోహన్,కాసాని సైదులు, పడి శాల గోపి, ఉడుగు వెంకటేశ్వర్లు, దాసరి వెంకన్న, బాలకృష్ణ, కొండ సత్యం, కిరణ్ రెడ్డి, రేగళ్ల కృష్ణ ప్రసాద్, సోషల్ మీడియా బాలకృష్ణ, ఆర్మీ రవి, మాదాసు ఆదాం తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు హాజరై భద్రమ్మ కు ఘన నివాళ్లు అర్పించారు. తర్వాత సింగరేణి మండలం సీతారాంపురం వాసి మన్నేటి జనార్దన్ మృతి చెందారు. ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ రాపర్తి నగర్‌లోని ఆయన కుమారుడు మన్నేటి నాగేశ్వరరావు స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి తండ్రి మృతి పట్ల నామ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్, కొడగంటి ఆంజనేయులు, మాటి రవి, కే ప్రమోద్, వై బాలాజీ, సంపత్, ఎస్ కృష్ణ కే పూర్ణ, రమేష్ పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం తర్వాత ఖమ్మం మమత రోడ్ ఇటీవల మృతి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు దొంగల కోటయ్య స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించారు. వారి కుమారుడు, సీపీఎం పార్టీ ఖానాపురం హవేలీ కార్యదర్శి తిరుపతిరావు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం కోటయ్య చేసిన సేవలను, తన సిద్ధాంతం పట్ల ఆయన చూపిన కట్టుబాటును నామ కొనియాడారు. నామ తో పాటు బిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ మోరంపూడి ప్రసాద్, గొడ్డేటి మాధవరావు, బాణాల వెంకటేశ్వర్లు, వాకదాని కోటేశ్వరరావు, భూక్య జ్యోతి, చిత్తారు ఇందుమతి, సిపిఎం నాయకులు గాలి వెంకటాద్రి, జట్ల ఆనందరావు, కత్తుల అమరావతి, గాలి అంజయ్య, ధనియాకుల నాగేశ్వరరావు,కోరిన్ని వెంకటేశ్వరరావు, తోట నాగరాజు, పందుల నాగమణి, తిప్పర్తి నరసింహారావు, నర్వనేని పురుషోత్తమరావు, పోతురాజు వెంకటి, పిన్నింటి శ్రీనివాసరావు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత సింగరేణి విశ్రాంతి ఉద్యోగి గడిపూడి సుధాకర్ భార్య జమున రాణి మృతి పట్ల గొల్లగూడెం రోడ్‌లోని వారి స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించారు. అదే విధంగా ఐదవ డివిజన్‌లో టీడీపీ సీనియర్ నాయకుడు కోయ శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ కార్పోరేటర్ జ్యోతి రెడ్డి, నాయకులు కోలేటి రాధాకృష్ణ, తొట్టె కొమరయ్య, పంతంగి వెంకటేశ్వర్లు, కొండపర్తి వెంకటేశ్వర్లు, కిషన్ నాయక్, యల్లంపల్లి హనుమంతరావు, పైడిపల్లి మహేష్ బిల్లగిరి వెంకటేశ్వర్లు, పెంట్యాల వెంకయ్య పాల్గొన్నారు. అనంతరంరఘునాథపాలెం క్రాస్ రోడ్ ప్రగతి ప్రైడ్ అపార్ట్‌మెంట్ వాసి సిరిపురపు వెంకటనరసయ్య మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను నామ పరామర్శించారు.WhatsApp Image 2025-09-25 at 9.07.34 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .