ఘనపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యానికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు (ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ) శనివారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల బంద్ ఘనపూర్ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జనగణ జిల్లా కన్వీనర్ ఎండి యూనస్ మాట్లాడుతూ, “విద్యాశాఖ మంత్రిని నియమించకుండానే సంవత్సరం పూర్తి కావడం విద్యావ్యవస్థపై ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనం. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాల నాణ్యత లేక విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవడం దురదృష్టకరం. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని బాధ్యత వహించాలి,” అని తీవ్రంగా విమర్శించారు.
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం జవాబుదారిత్వంతో ముందుకురావాలని డిమాండ్ చేశారు. బంద్ కార్యక్రమంలో రామ్ బాబు, సాయి, మహి, రాజు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల మూసివేతకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి మద్దతు లభించింది.


Comments