ఓయూ ఇంజనీరింగ్ కళాశాల‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఓయూ ఇంజనీరింగ్ కళాశాల‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తార్నాక, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మను మధ్యలో ఉంచి, బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు ప్రదర్శించగా, వాతావరణం ఉల్లాసభరితంగా ఉండింది.
కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ మంగు నాయక్‌లు మాట్లాడుతూ, తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. పూలను దైవంగా పూజించే ఈ పండుగ విద్యార్థులకు సంప్రదాయ విలువలను తెలుసుకునే అవకాశం కలిగించిందని వారు తెలిపారు.ఈ వేడుకలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు కలిసి పాల్గొని సంస్కృతి పరిరక్షణలో తమ భాగాన్ని తీర్చుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .