సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ
ముఖ్య అతిథిగా పాల్గొన్న డి ఈ ఓ డా. ఎం.గోవిందరాజు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెబ్బేరు మండలం యాపర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎం.గోవిందరాజుగారు శనివారం భూమి పూజ చేశారు. ప్రతి మూడవ శనివారం పాఠశాలల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్స్ ను పరిశీలించడానికి పర్యటిస్తున్న, ఆయన యాపర్లకు చేరుకొని అక్కడి హై స్కూల్ లో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖధికారి (డిఈఓ) మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడంలో తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తున్నామని వివరించారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచాడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. యాపర్ల హై స్కూల్ ను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్న దాతలు నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు శ్రీహరి రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ స్థాయి పాఠశాలలను తీర్చి దిద్దడంలో అక్కడి ప్రజల సహకారం ఉండాలని డి ఈ ఓ డాక్టర్.ఎం.గోవిందరాజు గారు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు రెగ్యులర్ గా విద్యార్థుల పాఠశాలకు పంపించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ఈనాటి కార్యక్రమంలో హెడ్ మాస్టర్ పలుస శంకర్ గౌడ్, కాంప్లెక్ హెచ్ ఎం.నరసింహా రావు, ఉపాద్యాయులు వెంకటేశ్, మెయినోద్ధిన్, ఈశ్వర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, వెంకటేష్ శర్మ, స్వరాజ్యం బాబు రెడ్డి, చైర్మన్ జయమ్మ, ఉపాధ్యాయులు బాలమ్మ, ఇందిర, రమేష్, ఆంజనేయులు, కవిత, శివాన,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments