బీజేపీ ద్వంద్వ వైఖరి విడ్డూరం
బీసీ జేఏసీ బందుకు సంపూర్ణ మద్దతు
— ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి
వనపర్తి,అక్టోబర్18(తెలంగాణ ముచ్చట్లు):
కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక విధంగా, రాష్ట్రంలో మరో విధంగా వ్యవహరించడం తగదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా విమర్శించారు.రాష్ట్ర బీజేపీ నాయకులు 42 శాతం బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతుంటే, కేంద్రంలో ఉన్న అదే పార్టీ ఆ రిజర్వేషన్లను అడ్డుకోవడం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు.ఇప్పటికైనా ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని మేఘారెడ్డి డిమాండ్ చేశారు.తెలంగాణ బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, వనపర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో జరిగిన బంద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, యూకో బ్యాంక్ చౌరస్తా, గాంధీ చౌక్, డాక్టర్ బాలకష్టయ్య చౌరస్తా, శంకర్‌గంజ్, ఇందిరా–వివేకానంద చౌరస్తాలు, పాలిటెక్నిక్, కొత్త బస్టాండ్, పొట్టి శ్రీరాములు చౌరస్తా, రామాలయం మార్గం గుండా సాగి ఆర్టీసీ డిపో మీదుగా రాజీవ్ చౌరస్తా వద్ద ముగిసింది.రాజీవ్ చౌరస్తాలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ..
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.


Comments