తూత నాగమణి చిత్రపటానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు.!
కుటుంబానికి అండగా బిఆర్ఎస్ పార్టీ.
ఐదు లక్షల చెక్కును కుటుంబానికి అందజేసిన జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు, తాతా మధు, మెచ్చా నాగేశ్వరరావు.
దమ్మపేట, ఆగస్టు 20(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమ కారిణి తూత నాగమణి దశదిన కర్మలో ఎంఎల్ సి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు, అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఉప్పల వెంకటరమణ, దిండిగల్ రాజేందర్, తదితర నేతలతో కలిసి పాల్గొని తూత నాగమణి చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి అందజేయమని పంపిన 5లక్షల. రూపాయల చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు.
ఎంఎల్ సి తాత మధు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో నాగమణి చేసిన కృషి మరువలేనిదనీ, అక్కచెల్లెమ్మల అందరికీ ఆమె ఆదర్శమని, తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని, వారి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఆశయం అనేది గొప్పదని, ఆ ఆశయం కోసం కోట్లాడినవారు గొప్పవాళ్ళని, ఆ గొప్పవాళ్ళల్లో మన నాగమణి అక్క ఉన్నారనీ చరిత్రలో నిలిచిపోతారనీ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు మాట్లాడుతూ, నాగమణి ప్రతి ఉద్యమంలో ముందుండేవారనీ, పోరాటాలే తెలంగాణను తెచ్చాయని. ఇలాంటి ఉద్యమ నాయకురాల వలన మన కల నెరవేరిందనీ అన్నారు.
,
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ..నాగమణి లేకపోవడం పార్టీకి చాలా పెద్ద లోటు అని, కానీ ఆమె చేసిన సేవలు కొత్త తరాలకు ప్రేరణగా నిలుస్తాయనీ, బిఆర్ఎస్ పార్టీ తరఫున కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొమ్మెర రామ్మూర్తి, పగడాల నరేందర్, రావు జోగేశ్వర రావు, దొడ్డ రమేష్, యుఎస్ ప్రకాష్ రావు, కాపు సీతామహా లక్ష్మీ, సింధు, రాజు గౌడ్, సున్నం నాగమణి, దారా యుగంధర్, అంకత ఉమా మహేశ్వరరావు, డా: భూక్యా ప్రసాద్, మోహన్ రెడ్డి, రావుల శ్రీను, జలగం వాసు, గాజుబోయిన ఏసుబాబు, బుడే, పాకనాటి శ్రీను, నారం శేఖర్, మండవ సత్య, గుమ్మడపు విష్ణు, వల్లేపు నాగేశ్వరరావు, కుకలకుంట కిషోర్, భారత రాంబాబు, అనుదీప్, వేంపాటి భారత్, అబ్దుల్ జిన్నా, కునుసోతు చిట్టిబాబు,యాట్ల వెంకమ్మ, నల్లపు నాగేంద్ర రావు, శ్రీను,రాజు,తదితరులు ఉన్నారు.


Comments