ప్రజలకు  అండగా బీఆర్ఎస్ పార్టీ 

ప్రజలకు  అండగా బీఆర్ఎస్ పార్టీ 

 హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

49వ డివిజన్ నాగేంద్రనగర్‌కు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కంది యాదగిరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే,
హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వారిని ఆదివారం గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్, రాజు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, “పేదల పక్షాన పోరాడేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే” అని తెలిపారు. స్థానికంగా మౌలిక వసతులు అందించడంలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుందని, రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ కనెక్షన్ల వంటి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు.


WhatsApp Image 2024-12-01 at 7.43.11 PM (4)“పేదల గుడిసెల జోలికి వస్తే ఊరుకోబోం. ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్, బీజేపీపై వ్యతిరేకతతో పాటు కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.

కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో కంది జ్యోతి, గుర్రాల రజిత, శ్యామల, కాంతమ్మ, రాజేష్, చింటు, సునీత, సుగుణ, ప్రవీణ్, సిద్ధు, కిరణ్, ఉమేష్, శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .