జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం...

ఖమ్మం నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం...

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సందర్బంగా ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు పాల్గొని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. దివంగత నేత మాగంటి గోపినాథ్  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి..నాకు అయనతో వ్వక్తిగత సంబంధం ఉంది అయన మరణం తీరని లోటు.ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కరోనా వచ్చి అందరు బయపడుతుంటే గోపినాథ్ అయన కార్యకర్తలతో ఖమ్మం వచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో పనిచేసి గెలుపు కొరకు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు.. ఈ ఉప ఎన్నికల్లో మనం కూడా కష్టపడి పనిచేసి మాగంటి గోపినాథ్ సతీమణి సునీత ని గెలిపించి రుణం తీర్చుకోవాలని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు విసుగుచెంది మరలా కేసీఆర్  ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు.WhatsApp Image 2025-10-14 at 7.52.23 PMకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన దొంగ హామీలు రైతు రుణమాపీ,రైతు భరోసా,రైతు బందు,నిరుద్యోగ భృతి,4వేల పెంక్షన్,ప్రతి మహిళకు 2500,ఆడపిల్లలకు స్కూటీలు,కల్యాణలక్ష్మితులం బంగారం ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతుందని ఈ విషయాలన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అర్జెసీ కృష్ణ,టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి,మాజీ జిల్లా గ్రంధాలయం చైర్మన్ ఖమర్,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ,డీప్యూటీ ప్లోర్ లీడర్ మక్బుల్,జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్,మండల అధ్యక్షులు వీరు నాయక్,మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి,కార్పొరేటర్లు చిరుమామిళ్ల లక్ష్మి నాగేశ్వరరావు,కూరాకుల వలరాజు,బుడిగం శ్రీను,పసుమర్తి రామ్మోహన్,జ్యోతి రెడ్డి,రుద్రగాని శ్రీదేవి ఉపేందర్,ముక్కాల రాజేష్, దనాల శ్రీకాంత్, సిడబ్ల్యుసి చైర్మన్ భారతి రాణి,కొల్లు పద్మ,షకీనా,శంసుద్దీన్,పల్లా రాజశేఖర్ మాజీ సర్పంచ్ హరిప్రసాద్,మెంటం రామారావు,చెరుకూరి ప్రదీప్,లక్ష్మణ్ నాయక్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .