సత్తుపల్లిలో బీసీ బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు.

హక్కుల సాధనలో బీసీలకు అండగా పార్టీ.

సత్తుపల్లిలో బీసీ బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు.

సత్తుపల్లి, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ ఘన మద్దతు తెలిపింది. శనివారం సత్తుపల్లి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీసీ హక్కుల కోసం నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కూసంపూడి మహేష్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయసమ్మతమని అన్నారు. బీసీలకు సరైన రిజర్వేషన్లు లభిస్తేనే సమాజ అభ్యున్నతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ల పెంపు పై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

బీసీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .