ఘనంగా కాప్రా సర్కిల్ సీఐటీయూ మహాసభలు

కార్మికుల కంటే యజమానులకే అనుకూలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి – జె. చంద్రశేఖర్

ఘనంగా కాప్రా సర్కిల్ సీఐటీయూ మహాసభలు

కాప్రా, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు)

కార్మికుల ప్రయోజనాలను పక్కనబెట్టి యజమానుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. చంద్రశేఖర్ విమర్శించారు. ఆదివారం కాప్రా సర్కిల్ సీఐటీయూ మహాసభలను కమలనగర్‌ లోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో పి. గణేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న జె. చంద్రశేఖర్ మాట్లాడుతూ – “మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌గా మార్చి కార్మిక వర్గానికి అన్యాయం చేసింది. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు” అని అన్నారు.సర్కిల్ అధ్యక్షుడు పి. గణేష్ మాట్లాడుతూ – “గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన చట్టాల అమలుపై నిర్లక్ష్యం చూపుతోంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది” అని విమర్శించారు. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.జి. శ్రీనివాసులు సీఐటీయూ పోరాట చరిత్ర, విశిష్టతను వివరించారు. బి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ కాప్రా సర్కిల్ పరిధిలోని పరిశ్రమలపై దృష్టి సారించి సీఐటీయూను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ కాప్రా సర్కిల్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాప్రా సర్కిల్ సీఐటీయూ కన్వీనర్‌గా పి. గణేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ సభ్యులుగా కొండల్ రెడ్డి, మణికంఠ, నరసింహ, కృష్ణ, సుధాకర్, రమేష్, ఆదం, బీమా, రవీందర్ రెడ్డి, యాదగిరి, అశోక్, దుర్గయ్య, శాంతకుమారి, ఎల్లమ్మ, రామకృష్ణ, రాజిరెడ్డి, ఖాజా, మహేష్, వెంకట్రావు తదితరులు ఎన్నికయ్యారు.
“కార్మికుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం” – పి. గణేష్.నూతనంగా ఎన్నికైన కన్వీనర్ పి. గణేష్ మాట్లాడుతూ – “కార్మిక వర్గం ఐక్యతతో ముందుకు సాగితేనే హక్కులు సాధ్యం అవుతాయి. కాప్రా సర్కిల్ పరిధిలోని పరిశ్రమల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం సీఐటీయూ కృషి చేస్తుంది. కార్మిక చట్టాల అమలు, కనీస వేతనాలు, కాంట్రాక్ట్ కార్మికుల దోపిడీ వంటి అంశాలపై సర్కిల్ స్థాయిలో ఉద్యమాలు కొనసాగుతాయి. ప్రతి పరిశ్రమలో సీఐటీయూ యూనియన్ బలపడేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .