నకిలీ వైద్యులపై చట్ట ప్రకారం కేసులు నమోదు
హాసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేని వ్యక్తులు ఎవరు కూడా అల్లోపతి,మోడర్న్ మెడిసిన్ వైద్య సేవలు అంధించరాదని ప్రథమ చికిత్స కేంద్రం ముసుగులో ఆశాస్త్రియ పద్ధతులలో ఇష్టంవచ్చిన ఆంటీబయోటిక్, స్టేరాయిడ్,నొప్పి ఇంజెక్షన్స్ వేయడం,ల్యాబ్ టెస్ట్ లు నిర్వహించడం,సెలైన్లు పెట్టడం,హాస్పిటల్ లాగా బెడ్స్ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసి,ప్రజారోగ్యం దెబ్బతీసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేష్ కుమార్ తెలియ జేశారు. వీరికి ఒక సంవత్సరం జైలు శిక్ష,5 లక్షల వరకు జరిమానా విధిస్తారని,రెండవ సారి కేసు నమోదు అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారని .సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సూచించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్ లఇందిరా గాంధీ విగ్రహం దగ్గర సిరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకుడు బి.కృష్ణ ప్రసాద్ (ల్యాబ్ టెక్నీషియన్ ),
భీమారంలో శ్రీ బాలాజీ క్లినిక్ నిర్వాహకుడు ఆర్. శ్రీకాంత్ (ల్యాబ్ టెక్నీషియన్ ),
జవహర్ నగర్ ప్రాంతంలో మై హెల్త్ హాస్పిటల్ నిర్వాహకుడు కె.శరత్ కుమార్ (బి ఫార్మసీ గవర్నమెంట్ ఉద్యోగి )
లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ డి. లాలయ్య కుమార్,చైర్మన్ డాక్టర్ కె.మహేష్ కుమార్ ల ఫిర్యాదు మేరకు ఎన్ ఎం సి చట్టం 34,54, టి ఎస్ ఎం పి ఆర్ చట్టం 22, బి ఎన్ ఎస్ 318,319 ప్రకారం కేయూ పోలీసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ (420/2025,421/2025 422/2025) నమోదు చేసినట్లు తెలిపారు.నకిలీ వైద్యుల పైన
91543 82727 నెంబర్ కి వాట్సాప్ ద్వారాసమాచారం ఇవ్వాలని తెలియ జేశారు.


Comments