కాప్రాలో ద్విముఖ బతుకమ్మ   ఆకర్షణగా నిలిచిన వేడుకలు

కాప్రాలో ద్విముఖ బతుకమ్మ   ఆకర్షణగా నిలిచిన వేడుకలు

కుషాయిగూడ, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో కాప్రా సాయి లీల ఎంక్లేవ్ కాలనీలో బతుకమ్మ వేడుకలు విశేషంగా జరిగాయి. ఈసారి కాలనీవాసుల మహిళలు మొదటి సారిగా ద్విముఖ బతుకమ్మను తయారు చేసి పండుగ జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ ద్విముఖ బతుకమ్మను ఆ కాలనీకి చెందిన ప్రఖ్యాత శిల్పి డాక్టర్ హోతి బసవరాజ్ ప్రత్యేక నైపుణ్యంతో రూపొందించారు. ఆయన ప్రతిభను అభినందిస్తూ కాలనీవాసులు ఘనంగా సత్కరించారు.వేడుకల్లో కాలనీ పెద్దలు, సొసైటీ ప్రతినిధులు ప్రెసిడెంట్ ఎం. ప్రభాకరన్, వైస్ ప్రెసిడెంట్ ఎం. విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ పి. విజయేంద్ర, జాయింట్ సెక్రటరీ బి. రుశెందర్, ట్రెజరర్ ఎం. మహంకాళి రావుతో పాటు టి. రామదాస్, శాంతి హరిరెడ్డి, మహమ్మద్ గౌరీ, ఎస్. నాగేశ్వరరావు, వివి రమణ, ఎస్.వి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బతుకమ్మ చుట్టూ ఆడిపాడిన కాలనీవాసులు, దేశ ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ ప్రత్యేక ద్విముఖ బతుకమ్మ కాలనీలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ చర్చనీయాంశమైంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .