కాలనీ సంక్షేమ సంఘం భవన నిర్మాణ భూమి పూజ
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గం లో కాప్రా మున్సిపాలిటీ,చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ శ్రీ సాయి కృష్ణ ఎంక్లేవ్ లో గురువారం జరిగిన కాలనీ సంక్షేమ సంఘం భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సాయి కృష్ణ ఎంక్లేవ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాలనీ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను మంజూరు అయ్యేలా చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.శ్రీ సాయి కృష్ణ ఎంక్లేవ్ అధ్యక్ష కార్యదర్శి వర్గం సభ్యులు రామచంద్ర రెడ్డి, తిరుమల్ రెడ్డి, వీణా, దేవి గీత తదితరులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి శాలువా కప్పి సత్కరించారు.
.ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి,నాయకులు నేమురి మహేష్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, గంప కృష్ణ,బి.వి. నరసింహారెడ్డి, ఎస్ ఏ రహీం, తాళ్ల వెంకటేష్ గౌడ్, జై కృష్ణ, సంపత్, ప్రసాద్ రెడ్డి, చల్ల వెంకటేశ్, శేఖర్ నాయక్, బాలాజీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments