పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

నర్మెట్ట, తెలంగాణ ముచ్చట్లు:

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మచ్చుపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు జడల రమేష్ ఆధ్వర్యంలో వేల్పుల రేణుక భర్త రాజయ్య కు రెండు లక్షల 50 వేల రూపాయలు ఎల్ఓసిని  రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ అందజేశారు. వెన్నుపూస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రేణుక వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. స్థానిక నాయకుల ద్వారా కిరణ్ కుమార్ విషయాన్నీ బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించి రెండు లక్షల యాభై వేయిల రూపాయలు మంజూరు చేయించారు. కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ కొమురవెల్లి దేవస్థానం అధ్యక్షులు గొల్లపల్లి కుమారస్వామి, మాజీ ఎంపీపీ బుక్క జయరాం, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బండి అశోక్, కూకట్ల చంద్రమౌళి, ఎస్టీ సెల్ అధ్యక్షులు నూనావత్ రాజకుమార్,నాయకులు దేవ్ సింగ్, మధు గుప్తా, అంజయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బుర్ర రాజు  తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .