రాపాకపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
-అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్
Views: 8
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ధర్మసాగర్ మండలంలోని రాపాకపల్లి గ్రామంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు పవిత్ర గ్రంథంగా నిలిచిందని అన్నారు. రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేస్తూ, మహిళల హక్కులు కల్పించడం వంటి అనేక చారిత్రాత్మక మార్పులకు దారితీసిందని కొనియాడారు. ప్రజలందరూ రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
వేడుకలో అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కందుకూరు ప్రభాకర్, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి కందుకూరి కిషన్, ఇతర నాయకులు కుమారస్వామి, రాజేంద్రప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments