ధర్మ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ధర్మసమాజ్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు వీరపాగ రామకృష్ణ

ధర్మ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు విరపాగ రామకృష్ణ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో భారత రాజ్యంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. 
బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు తమ జీవితాంతం పోరాటలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి, 
ప్రపంచ దేశాలకే ఆదర్శం అయ్యే విధంగా భారతదేశానికి భారత రాజ్యాంగ 
అందించిన  గొప్ప మహనీయుడు అని కొనియాడారు. ఆంగ్లేయులపై పోరాటం చేసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం జరిగింది. ఆ సిద్ధించిన స్వాతంత్ర్య  భారతదేశనికి అంబేడ్కర్ గారు 2 సంవత్సరాల,11నెలల, 17రోజులు) ఎంతో కష్టపడి తన రక్తాన్ని సిరగా మార్చి భారత రాజ్యాంగం పరిషత్ ద్వారా ఎన్నికై భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం,సోదర భావం,లౌకిక, 
ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాడు భారతదేశ రాజ్యాంగ పరిషత్ కమిటీ 
భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందని గుర్తు చేశారు. 
నేటితో భారత రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలియచేస్తూ,75 సంవత్సరాల భారతదేశంలో ప్రజల జీవన మనుగడలో ఎలాంటి మార్పులు లేవని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది దీనికి కారణం భారత దేశ పరిపాలకులు సంపూర్ణంగా భారత రాజ్యాంగాన్ని అమలు పరచకపోవడమే అని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలుపరిచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన విద్య,వైద్యం,ఉపాధి, భూమి,ఇల్లు కల్పించాలని 
హితవుపలికరు.ఈ అగ్రకుల పార్టీలా నాయకుల ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా సంపూర్ణంగా అమలు పరచకపోతే భవిష్యత్తులో  ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ,గ్రామాన భారత రాజ్యాంగాన్ని అవగాహన కల్పిస్తూ వివిధ రూపాల్లో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారత రాజ్యాంగ మయం చేస్తామని 
పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో  ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నత్తి సుధాకర్ మహారాజ్,జిల్లా నాయకులు ఆంజనేయులు,అశోక్,కురుమన్న, గంధం నాగరాజ్,కిరణ్,రవి,విజయ్ మధు,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .