జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తా

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తా

కాప్రా ప్రెస్ క్లబ్‌లో వ్యక్తిగత ప్రమాద బీమా బాండ్ల పంపిణీ

కాప్రా, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే శక్తి అని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వ స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.శుక్రవారం కాప్రాలోని టీఎస్ఐఐసి కాలనీ ప్రాంగణంలో కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యక్తిగత ప్రమాద బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,“జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే సామాజిక సైనికులు. వర్షం, ఎండ, ప్రమాదం అన్న తేడా లేకుండా వార్తా సేకరణలో నిత్యం కష్టపడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు. అలాంటి బాధ్యతగల వృత్తికి సంబంధించిన వ్యక్తుల భద్రతా పరిరక్షణకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కాప్రా ప్రెస్ క్లబ్ ఈ దిశగా బీమా సదుపాయం కల్పించడం అభినందనీయం” అని తెలిపారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జర్నలిస్టులు ఐక్యతతో ఉండి తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకోవాలని, అన్యాయానికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు.“విలువలతో పనిచేసిన పాత్రికేయుల పేరు కాలం చెల్లదు. పత్రికా వృత్తి అంటే కేవలం వార్తా సేకరణ మాత్రమే కాదు — అది సమాజ మార్పు దిశగా ఒక ఉద్యమం” అని పేర్కొన్నారు.కాప్రా ప్రెస్ క్లబ్ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం కల్పించిన స్థానిక నాయకుడు పాండాల శివకుమార్ గౌడ్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమ నిధికి సహకారం అందించిన మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, నాయకులు రాఘవరెడ్డి, వంజరి ప్రవీణ్ కరిపే, సామాజిక సేవకుడు బండే గౌడ్ ను ఆయన ప్రశంసించారు.తరువాత జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా బాండ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మోతే వెంకటరెడ్డి, మల్కయ్య, పాంజాల శ్రీనివాస్ గౌడ్, కేసి మోహన్, సత్యనారాయణ, సహదేవ చారి, జ్యోతిర్మయ చారి, చంద్రమౌళి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉల్లోజు శ్రీనివాస్, కార్యదర్శి వేముల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి రుద్రగోని నర్సింగ్ గౌడ్, ఉపాధ్యక్షులు ఆదిమూలం శ్రీనివాస్, నటరాజ్, అక్బర్, మాజీ అధ్యక్షుడు శనిగరం అశోక్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు పాల్గొన్న పాత్రికేయులు పరస్పరం అభినందించుకున్నారు. బీమా పథకం వల్ల పాత్రికేయులకు భద్రత కలగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.IMG-20251010-WA0009

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .