ప్రజలకు ఇబ్బంధులు కలగకుండా డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి
కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్
చిల్కానగర్, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతోందని డివిజన్ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు.డివిజన్ పరిధిలో రూ.90 లక్షల వ్యయంతో బ్యాంక్ కాలనీ నుంచి సాయిరాం నగర్ కాలనీ వరకు నాలుగు ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్న బాక్స్ డ్రెయిన్ పనులను ఆమె జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ శాఖ అధికారుల తో కలిసి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, డ్రెయిన్ నిర్మాణ పనుల సమయంలో కాలనీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్ణయిత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ డీఈ, ఏఈల పర్యవేక్షణలో పనులు జరగాలన్నారు. నాణ్యతలో ఎలాంటి లోపాలు తలెత్తినా కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్‌స్పెక్టర్ కేదార్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎదుల్ల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, బాలకృష్ణ గౌడ్, ముద్దం శ్రీనివాస్ యాదవ్, బంటి గౌడ్‌తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.


Comments