అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరాఫ్ చేయాలి: సీపీఎం డిమాండ్ 

అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరాఫ్ చేయాలి: సీపీఎం డిమాండ్ 

జఫర్గడ్, తెలంగాణ ముచ్చట్లు :అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్దేశ్య పూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని, మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య ఆరోపించారు.సోమవారం మండల కేంద్రంలో  సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అమిత్ షా వాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు . అనంతరం సోమయ్య మాట్లాడుతూ.... ఇప్పుడు ఈ దేశానికి రాజ్యాంగం పనికిరాదని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మాన్ని శాస్త్రాన్ని రాజ్యాంగంలో  అమలు చేయాలని కుట్రలో భాగంగానే అమిత్ షాభారత రాజ్యాంగ నిర్మాతను కించపరిచేలా, ఈ దేశ ప్రజలను అవమానించేలా, పార్లమెంటు నిస్సిగ్గుగా మాట్లాడారాని విమర్శించారు. బీహార్ అంబేద్కర్ ఆనాడే మన సంస్కృతిని వ్యతిరేకించి ఇది అమలు జరుగుతే అణగారిన వర్గాల స్థితిగతులు మరింత దయనీయంగా మారుతాయని ప్రజలను మేల్కొల్పడం కోసం తాను స్వయంగా మన సంస్కృతిని తగలబెట్టారని అన్నారు. దీన్ని జీర్ణించుకోలేని  ఆర్ఎస్ఎస్ బిజెపిలో అంబేద్కర్ అన్న గిట్టడం లేదని, హిందుత్వ భావాజాలాన్ని ప్రజల్లోకి నొప్పించడం వీలు కావడం లేదని కుట్ర బుద్ధితో ఇలాంటి వ్యాఖ్యలు చేసి, దేశ ప్రజల మధ్య విభజన రేఖలు గీసి రెచ్చగొట్టి మత కల్లోలాలు సృష్టించి పగ్గం గడుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుండెబోయిన రాజు, సిపిఎం మండల కమిటీ సభ్యులు కాట సుధాకర్ , పార్టీ నాయకులు నీరటి కొమురయ్య, ఎర్ర రవి, జి కొమురయ్య, డి లక్ష్మి, శోభ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .