దరిపల్లి అనంత రాములు కాలేజ్ లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 22, తెలంగాణ ముచ్చట్లు;
స్థానిక ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం కొత్తూరు గ్రామం శివారులో గల దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బీటెక్ | పాలిటెక్నిక్ | ఎంబీఏ | ఎంటెక్) నందు కళాశాల ఆవరణలో ప్రారంభమైన ఫ్రెషర్స్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన కళాశాల దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే అనేది సీనియర్ విద్యార్థులు కళాశాల లో నూతనంగా జాయిన్ ఐన జూనియర్ విద్యార్ధులకి ఇచ్చే స్వాగత కార్యక్రమ మని ప్రతి ఒక్కరూ మంచిని అలవర్చుకొని దరిపల్లి క్యాంపస్ నందు రిసోర్సెస్ అనగా ఫాకల్టీ, లైబ్రరీ, గేమ్స్, స్పోర్ట్స్, ఎన్ సీ సీ మరియు స్టార్ట్ ఆఫ్ ది ఫెసిలిటీస్ నీ అందిపుచ్చుకోవాలని తద్వారా ఉన్నత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభ ఉండి 75 శాతం కన్నా ఎక్కువ మార్కులు డిగ్రీ కోర్సులో సాధించిన విద్యార్థినీ విద్యార్థులు తమ కళాశాలలో ఐసెట్ ద్వారా జాయిన్ అయితే విద్యార్థిని విద్యార్థులకు కళాశాల నందు యూనివర్సిటీ కి చెల్లించే ఫీజులు మరియు ఎగ్జామినేషన్స్ మరియు ఇతర ఫీజులు అన్నియు కూడా మెరిట్ స్కాలర్ షిప్ క్రింద కళాశాల నుంచి అందచేయగలమని దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ ఈ సందర్భంగా అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల కి విచ్చేసిన కళాశాల ట్రెజరర్ దరిపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ సీనియర్స్ ఇచ్చే స్వాగతసత్కరలికి జూనియర్ విద్యార్థిని విద్యార్థులు తీసుకుంటూనే వారి నుంచి మంచిని నేర్చుకొని తద్వారా మంచి అవకాశాలు అంది పుచ్చుకునేందుకు కళాశాల పూర్వ విద్యార్థుల అలుమ్ని కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా టాప్ ఏం ఎన్ సీ కంపెనీ లలో ఉద్యోగాలు సాధించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ దరిపల్లి స్వాతి మాట్లాడుతూ ఫ్రెషర్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరిని పలకరించటం వలన మీ క్యారెక్టర్ మెరుగు పరచుకోవచ్చని అందరికీ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కి విచ్చేసిన దిశ టీం చైర్మన్ రేవతి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తోటి వారితో మంచిగా మెలగాలని, తల్లిదండ్రులను, తోటి విద్యార్థిని విద్యార్థులను, గురువులను, పెద్ద వారిని అందరూ గౌరవించాలని కోరారు. ఈ సందర్భంగా డి డి యూ జే కె వై ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాంపస్ నందు చదువుతో పాటు ఆట పాట ల లో కూడా రాణించాలని కోరారు. ఫ్రెషర్ డే కార్యక్రమంలో ఫ్రెషర్ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, వినోదం, స్కిట్, సోలో, గ్రూప్ డాన్స్ మరియు ఆటలు సీనియర్ విద్యార్థిని విద్యార్థులు చేసి జూనియర్ విద్యార్థులకు మార్గ నిర్దేశకులు అయ్యారు. ఈ కల్చరల్ కార్యక్రమంలో దసరా సందర్భంగా నృత్యం పౌర్ణమి సోలో మరియు అమ్మవారి గ్రూప్ డాన్స్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్, కరెస్పాండెంట్ దరిపల్లి స్వాతి, కళాశాల ట్రెజరర్ దరిపల్లి ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ చైతన్య, అలాగే కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న విభాగాధిపతులు ఏవో చిరంజీవి, ప్రియాంక, మానసరాజ్, నవీన్, శ్రీనివాస్, రవి కుమార్, వెంకట్రావు లను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, మరియు ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.


Comments