బీజేపీ నేతల వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ కౌంటర్

బీజేపీ నేతల వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ కౌంటర్

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
 కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కులం ఏంటో తెలియని స్థితిలో ఉన్న బీజేపీ నాయకులు, కుల-మత రాజకీయాలు చేస్తూ విమర్శలు చేయడం సిగ్గుచేటని తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు.

మోడీ బీసీ కాదని, కన్వర్టెడ్ బీసీ అని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కానీ, దాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం బీజేపీ నేతల అసలు రంగును బయటపడేస్తోందన్నారు.

“రాహుల్ గాంధీ ది ఏ కులం?” అని ప్రశ్నించే బీజేపీ నేతలకు, ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని తెలియకపోవడం వారి అజ్ఞానాన్ని చూపిస్తోందన్నారు. దేశంలోని అన్ని వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ పోరాడుతుంటే, బీజేపీ నాయకులకు అది నచ్చడం లేదని మండిపడ్డారు.

కుల గణన చేపడితే ఏ వర్గం ఎంత ఆర్థిక స్థాయిలో ఉందో స్పష్టమవుతుందని, దాని వల్ల అధికారం కోల్పోతామని భయపడే ప్రధాని మోడీ కుల గణనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

బీజేపీ నేతలు మతాలు, కులాల పేరుతో కుహనా ఉద్యమం చేస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయం చేస్తూ బీజేపీ త్వరలో భూ స్థాపితం అవుతుందని దయాకర్ హెచ్చరించారు.

“రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి. ఆయన కుటుంబాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలు, మహాత్మా గాంధీని కూడా అవమానిస్తున్నారు” అని ఆరోపించారు.

“దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాహుల్ గాంధీకి ప్రజల మద్దతు పెరుగుతుందే తప్ప, తగ్గదు” అని ఆయన అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .