కన్నుల పండువగా దేవతామూర్తుల ప్రతిష్టాపన కార్యక్రమం
నాగారం, అక్టోబర్ 29, (తెలంగాణ ముచ్చట్లు) :
నాగారం మున్సిపాలిటీలో ఎస్ వి నగర్ రోడ్ నెంబర్ 8 లో శ్రీ లక్ష్మీ గణపతి అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ వల్లి దేవసేనా సహిత సుబ్రహ్మణ్యస్వామి, నాగబంధ, మృత్యుంజయ, మేధా దక్షిణామూర్తి, అభయాంజనేయ, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజా, పుణ్యాహవాచనం, రుద్రాభిషేకం, రుద్రహోమం, చండీ పారాయణాలు, చండీ హోమం, గర్తన్యాసం, యంత్ర ప్రతిష్ఠ బింబప్రతిష్ఠ, నేత్రోన్మీలనం, బలిహరణ, ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసం, కుంభాబిషేకం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం అన్నసమారాధన కార్యక్రమాలను నిర్వహించారు
. సప్త సహస్రాధిక ప్రతిష్ఠాపనాచార్యులు జక్కి కృష్ణావధాని, నరహరి అవధాని, పిరాట్ల హేమదుర్గా రామకృష్ణ శర్మ, హరిపవన కుమార శర్మలచే వింశతి (20) సంఖ్యాక ఋత్విగ్వరేణ్యులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఎంవిఎల్ఎన్ శాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, సహాయకులు జమ్మలమడక శ్రీరమణ శర్మ, ఆలయ అధ్యక్షులు దాచా శ్రీనివాస్ గుప్తా ఎర్రం ఈశ్వరయ్య గుప్త, లింగా నాగేంద్రగుప్త, పీవీవీ. సత్యనారాయణ నరసింహస్వామి గౌడ్, గంగిరెడ్డి నరేందర్ రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వరావు, వి. నర్సింహాస్వామి గౌడ్, ఆంజనేయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


Comments