అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
రాష్ట్ర అటవీ,పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష నిర్వహించారు. సోమవారం హనుమకొండలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జిడబ్ల్యూఎంసి, కుడా, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల పనుల పురోగతిని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు..jpeg)
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, నిర్దేశిత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, డిఎఫ్‌ఓలు అనూజ్ అగర్వాల్, లావణ్య, కుడా పిఓ అజిత్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈలు శ్రీనివాస్, భీమ్రావు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments