సింగరేణిలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.!
మహా అన్నదానంలో పాల్గొన్న ఐఎన్టీయూసీ నాయకులు.
సత్తుపల్లి, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని జే.వి.ఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహల్లాద్, మేనేజర్ రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యదర్శి తీగల క్రాంతి కుమార్ దేవీ అమ్మవారి సన్నిధిలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని ఆరాధించి, దసరా సంబరాలు జరుపుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాలపై ఉండాలి అని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఐఎన్టీయూసీ నాయకులు నాగ ప్రకాష్, రామారావు (ఫిట్ సెక్రటరీ, జే.వి.ఆర్ ఓసి), బాలాజీ (ఫిట్ సెక్రటరీ, కిష్టారం ఓసి), నాగేశ్వరరావు (ఫిట్ సెక్రటరీ, జే.వి.ఆర్-సి.హెచ్.పి), ఓల్డ్ సి.హెచ్.పి ఇంచార్జ్ చంద్రమౌళి, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ కాజా, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుదర్శన్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు కోటి, ఐవీ రెడ్డి, సురేష్, రఘువీర్, నరేందర్, మురళి, ఓం సాయి, రమేష్, అశోక్, బాలు, తిరుమల రావు, పొట్టి కిరణ్, రామచందర్, సందీప్, హరికుమార్, అమ్రోస్, శ్రీధర్, రవిశంకర్, షడ్రక్ బాబు తదితర ముఖ్య నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments