ధరణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండలోని రెవెన్యూ క్లబ్‌లో ధరణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు, సంఘ అధ్యక్షులు హాజరై, నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించగా, అనేక కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి.
సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా చెన్నగాని పురుషోత్తం (సూర్యాపేట) ఎంపికవగా, ఉపాధ్యక్షులుగా శివ సాయి వెంకట వరప్రసాద్ (నల్గొండ), చక్రధర్ (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా నాగరాజు (హనుమకొండ) ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా లింగం (కామారెడ్డి), పవన్ (మేడ్చల్), కోశాధికారిగా అభిలాష్ (జగిత్యాల) బాధ్యతలు స్వీకరించారు.
ఇక కార్యవర్గ సభ్యులుగా సుకర్ణ రెడ్డి (వికారాబాద్), ప్రవీణ్ (ఖమ్మం), రామ్మోహన్ (నిజామాబాద్), శివప్రసాద్ (నారాయణపేట) ఎన్నిక కాగా, సలహాదారులుగా రాజలింగం (మంచిర్యాల), బాలనరసింహ (యాదాద్రి భువనగిరి), లక్ష్మీకాంత్ (మహబూబ్ నగర్) ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ, ధరణి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. సమావేశ నిర్వహణకు సహకరించిన హనుమకొండ జిల్లా యూనియన్‌కు, ఎన్నికల నిర్వహణను విజయవంతం చేసిన గౌరవ అధ్యక్షులు డా. కొనగాల మహేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments