సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు  చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు  చెక్కుల పంపిణీ

ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;

తిరుమలాయపాలెం మండలానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి   క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. మొత్తం 80 మంది లబ్ధిదారులకు రూ.25.33 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... “కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధ్యేయం అన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు సీఎంఆర్ఎఫ్ ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తోందని పేర్కొన్నారు.  పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి చొరవతో గత ప్రభుత్వం కంటే త్వరగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తున్నాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీను, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, బోడ మంగీలాల్, అరవింద్ రెడ్డి, ఉన్నం రాజశేఖర్, మండల పార్టీ ఇన్‌చార్జ్ గుర్రాల శ్రీనివాసరెడ్డి, జడల నగేష్ గౌడ్, పోట్ల కిరణ్, అంబేద్కర్, తాటికొండ కిరణ్, దుదిమెట్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .