సింగరేణి సి.ఎస్.ఆర్. నిధులతో విద్యార్థులకు స్కూల్ సామగ్రి పంపిణీ.!
చిన్నారులకు అందజేసిన జి.ఎం చింతల శ్రీనివాస్.
Views: 19
On
సత్తుపల్లి, నవంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియాకు చెందిన సత్తుపల్లి జి.ఎం చింతల శ్రీనివాస్, శనివారం స్థానిక ఎంపీపీ ఎస్ కిష్టారం స్కూలు, ఎంపీపీ ఎస్ కిష్టారం హరిజనవాడ స్కూలు, ఎంపీపీ ఎస్ ఎస్సీ కాలనీ పాఠశాలలకు చెందిన 135 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, షూస్, సాక్స్, టై మరియు బెల్టులను సింగరేణి సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జి.ఎం చిన్నారులతో మాట్లాడుతూ, మీరు బాగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అని పిల్లలకు ఆశీర్వచనాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి. నరసింహారావు, కిష్టారం ఓసి నరికుల్లా రవికుమార్, జనార్ధన్, కిష్టారం గ్రామస్తులు మరియు వెల్ఫేర్ ఆఫీసర్ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments