హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి
-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు.ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ , తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హల్ లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎయిడ్స్ అవగాహన పోస్టర్స్ ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు.
అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరంగల్ డాక్టర్ బి సాంబశివరావు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రధాన ద్వారామ్ నుండి ఐఎంఏ హాల్ వరంగల్ వరకు ర్యాలీని నిర్వహించడం జరిగినది.
అనంతరం కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ వరంగల్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎయిడ్స్ అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా, కలుషితమైన సూదులు సిరంజిల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొక్కరికి ఎక్కించడం ద్వారా ,హెచ్ఐవి సోకిన తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు వచ్చునని అన్నారు. వివిధ వ్యాధుల ద్వారా మరణించే వారి గణాంకాల ప్రకారం కన్న ఎయిడ్స్ వ్యాధి వల్ల మరణించే వారి సంఖ్య చాలా తక్కువని తెలిపారు . ప్రజలలో వైద్య ఆరోగ్యశాఖ, ఎన్జీవోలు కీలకమైన సేవలందిస్తున్నారని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎయిడ్స్ పై చర్చించుకోని అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రజలలో చైతన్యం కలిగితే ఎయిడ్స్ దినోత్సవం జరుపుకోనే అవసరమే ఉండదని ఆకాంక్షించారు.
డాక్టర్ బి సాంబశివరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న ఎయిడ్స్ సేవలపై ప్రగతి నివేదిక వివరించారు. ఈ సంవత్సరం" కలెక్టివ్ యాక్షన్ సస్టీన్ మరియు ఎక్సెలరేట్ హెచ్ఐవి ప్రోగ్రెస్" నినాదమును తెలుపుతూ జిల్లాలో ఐసిటిసి కేంద్రాలు మూడు, తల్లి నుండి హెచ్ఐవి పిల్లలకు సోకకుండా చేసే కేంద్రము ఒకటి ,ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎయిడ్స్ పై అవగాహన నిర్ధారణ చేయబడునని తెలిపినారు. ఏఆర్టీ కేంద్రం, లింకు ఎఆర్టి కేంద్రాలు, సపోర్ట్ కేంద్రాలు ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందిస్తున్నామని తెలిపినారు. రక్తనిధి కేంద్రాలు మూడు పనిచేస్తున్నాయని 2023 24 సంవత్సరములలో 31, 688 వ్యక్తులకు హెచ్ఐవి రక్త పరీక్షలు చేయగా 493 మందికి హెచ్ఐవి ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగినది ,13022మందికి గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి రక్త పరీక్షలు చేయగా ఏడు మందికి హెచ్ఐవి ఉన్నట్లు నిర్ధారించామని, ఏప్రిల్ 2024 నుండి అక్టోబర్ 2024 వరకు 19900 మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించగా 262 మందికి హెచ్ఐవి ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగినదని .గర్భిణీ స్త్రీలకు 11210 మందికి హెచ్ఐవి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి హెచ్ఐవి ఉన్నట్లుగా నిర్ధారించడం అయినదని, జిల్లాలోని ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ లలో డాక్టర్లకు హెచ్ఐవి టెస్టింగ్ మరియు హెచ్ఐవి ప్రాముఖ్యత గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. జిల్లా కలెక్టర్, మరియు జిల్లా న్యాయ సేవ సంస్థ సహకారముతో హెచ్ఐవి పాజిటివ్ కలిగిన వ్యక్తులకు 10 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుచున్నది .కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులకు హెచ్ఐవి , టిబి ,బ్లడ్ డొనేషన్ పై అవగాహన నిర్వహించి వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగినదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆహ్వానితులు ఎయిడ్స్ పై ప్రసంగించి, అందరూ ఎయిడ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.
అనంతరము ఎయిడ్స్ నిర్ములన కార్యక్రమంలో ఉన్నతమైన సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమములో ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ కిషోర్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్ ,డాక్టర్ మోహన్, సింగ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పద్మశ్రీ ,డాక్టర్ సూర్య ప్రకాష్ ,ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అన్వర్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, ఎయిడ్స్ జిల్లా కోఆర్డినేటర్ మాధురి, డిప్యూటీ డెమో అనిల్ కుమార్ , ఎన్జీవోస్ సర్వోదయ శాంత రాజు, ఆర్డిఎంఎం ఈశ్వర్, మేరీ విజయ, మైగ్రేడ్స్ గోవర్ధన్, డిఆర్పి ముస్తాక్, ట్రాక్టర్స్ నవ్య , వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎన్సిసి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments