14వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల ఎన్నిక
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌లో బాలాజీ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీ ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
14వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పస్తం శంకర్‌ను, బాలాజీ నగర్ గ్రామ అధ్యక్షుడిగా కడెం కుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, మాజీ సోషల్ మీడియా రాష్ట్ర సమన్వయకర్త అడుప మహేష్ పాల్గొన్నారు. వారిని శాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.
అన్ని గ్రామాల అధ్యక్షుల నియామకం పూర్తయిందని, నాలుగు రోజుల్లో బీసీ సెల్, సోషల్ మీడియా, యూత్, మైనార్టీ విభాగం, మహిళా కమిటీ ఏర్పాట్లు పూర్తవుతాయని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షులను శాలువాతో సన్మానించి ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments