వరంగల్‌లో రాష్ట్రంలోనే తొలి క్రీడా & సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల ఏర్పాటు
హన్మకొండ:
వరంగల్‌లో రాష్ట్రంలోనే అత్యుత్తమ క్రీడా మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలను ఏర్పాటు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ, వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా పాఠశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 15 నుండి పాఠశాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో 80మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభించనున్నట్లు చెప్పారు.
హాస్టల్, ఇండోర్ మరియు అవుట్‌డోర్ క్రీడా వసతులు, తరగతి గదులు, అవసరమైన మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ బదలాయింపులు, డిపిఆర్ సిద్ధం, నాణ్యమైన పనులు చేయాలని సూచించారు. రేపు ఉదయం 9 గంటలకు స్టేడియాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ, రెవెన్యూ, యువజన క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.


Comments