ప్రతి ఒక్కరూ వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
మద్దిగట్ల మాజీ ఎంపీటీసీ రామచంద్ర గౌడ్
Views: 25
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో మాజీ ఎంపీటీసీ రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనమని, ఏ వయస్సులో అయిన పట్టుదలతో పని చేస్తే విజయం సాధించవచ్చు అని వాల్మీకి మహర్షి నిరూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామచంద్ర గౌడ్, మాజీ సర్పంచ్ చెన్నకేశవులు, భీమని పెంటయ్య, రాములు గౌడ్, శివారెడ్డి, మీసాల చంద్రయ్య, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments